శుక్రవారం 27 నవంబర్ 2020
Peddapalli - Jul 07, 2020 , 02:19:29

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  •  పెద్దపల్లి డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌

కమాన్‌పూర్‌: వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో చిత్తడి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గోదావరిఖని ఏరియా దవాఖానలో 30 పడకలు, పెద్దపల్లి ఏరియా దవాఖానలో 20 పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 330 పరీక్షలు చేయగా 52 మందికి కరోనా పాజిటివ్‌ రాగా ఇందులో ఆరుగురు వ్యక్తులు మృతి చెందినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించే  పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు భౌతిక దూరం పాటించాలని కోరారు. ఆయన వెంట పీహెచ్‌సీ వైద్యాధికారి అశోక్‌కుమార్‌ ఉన్నారు.