హైదరాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు 10 లోపు 6 అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల ఎండీలు పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో జీ నీల్‌కృష్ణ 1వ ర్యాంకు, హెచ్ విదిత్ 5వ ర్యాంకు, ఎం అనూప్ 6వ ర్యాంకు, ఎం సాయితేజ 7వ ర్యాంకు, సీహెచ్ సతీశ్‌కుమార్ 8వ ర్యాంకు, ఆర్యన్ ప్రకాష్ 10వ ర్యాంకు, పీ రోహన్‌సాయి 12వ ర్యాంకు కైవసం చేసుకొన్నారని పేర్కొన్నారు.
ఆలిండియా ఓపెన్ క్యాటగిరీల్లో 100 లోపు 28, 1000 లోపు 171 ర్యాంకులు సాధించారని తెలిపారు. ఆలిండియా అన్ని క్యాటగిరీల్లో 10లోపు 25, 100 లోపు 112, 1000 లోపు 735 ర్యాంకులతో ప్రతిభ చూపారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, సిబ్బందిని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.