హైదరాబాద్, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా చేపట్టే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్‌చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన బీ నాగధర్‌సింగ్ దాఖలుచేసిన పిల్‌ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్అరాదే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఎన్నికల సంఘం నిరుడు డిసెంబర్నాటి మార్గదర్శకాల ప్రకారం మూడేళ్లకు పైబడి ఉన్న ఉద్యోగులను బదిలీ చేయాలని, గత ఫిబ్రవరి నాటి సూచనల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి దారితీసేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్‌దేశాయ్ ప్రతివాదన చేస్తూ… అక్రమ మద్యం కట్టడికి ఎక్సైజ్ అధికారులే అవసరంలేదన్నారు. హైకోర్టు తీర్పును వాయిదావేస్తున్నట్లు ప్రకటించింది.