Kamareddy rains |కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. అలుగు దుంకుతున్నాయి. వర్షాల ధాటికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలమయమై జనాలు కాలు తీసి బయటపెట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. కాగా వర్షాల నేపథ్యంలో వరద ఉధృతితో జాతీయ రహదారిని 44 తాత్కాలికంగా మూసివేశారు.
కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి 44తోపాటు జంగంపల్లి వద్ద భారీవర్షం వలన నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపధ్యంలో ఆ రోడ్డును మూసివేశారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల కొద్ది వాహనాలు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి.
ఉప్పొంగిన బొగ్గు గుడిసే వాగు..
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసె వాగులో కార్మికులు చిక్కుకుపోయారు. బ్రిడ్జి నిర్మాణం కోసం పని చేస్తూ, వాగు వరదలో కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులు వాటర్ ట్యాంకర్‌పై ఎక్కి తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.
Health tips | మొక్కజొన్నతో గుండెకు మేలు.. ఇంకా ఎన్ని లాభాలో..!
Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు
CP Radhakrishnan | తిరుమలకు చేరుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి