తిరుమల : మహారాష్ట్ర గవర్నర్ ( Maharastra Governor) , ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) తిరుమలకు చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తరువాత తొలిసారి బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళికృష్ణ పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు.