Kamareddy Floods | కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు జనజీవనం అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండంతోపాటు చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రం నలుమూలల వరద నీరుపోటెత్తడంతో చాలా కాలనీలు జలదిగ్భంధం అయ్యాయి. వరద ముంచెత్తడంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ ఇండు, అపార్ట్మెంట్లలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కాగాపాఠశాలలో ఉన్న సుమారు 350 విద్యార్థులు వరద నీటిలో చిక్కుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ అంబర్ సింగ్ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెస్య్కూ టీమ్ సభ్యులు వరదల్లో చిక్కిన విద్యార్థులను తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. విద్యార్థులకు కామారెడ్డి పట్టణంలోని కళ్యాణ మండపంలో ఉంచి సౌకర్యాలు కల్పించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు
Zaheerabad Rains | నిండుకుండలా మంజీరా.. పొంగిపొర్లుతున్న వాగులతో స్తంభించిన జనజీవనం
Zaheerabad Floods | వరద ముంపులో జహీరాబాద్ కాలనీలు.. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే మాణిక్ రావు