flood hit ares జహీరాబాద్, ఆగస్టు 27 : ఎడతెరిపి లేకుండా కుడుస్తున్న భారీ వర్షానికి జహీరాబాద్ పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీతోపాటు పలు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగాయి. దీంతో ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పార్టీ శ్రేణులతో కలిసి కాలనీలలోకి వెళ్లారు.
ఎమ్మెల్యే స్వయంగా వరద నీటిలోకి దిగి నీట మునిగిన ఇళ్లను, వరద ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని నిర్దేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వారిలో ఎమ్మెల్యేతోపాటు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, పార్టీ నాయకులు, కాలనీ వాసులు ఉన్నారు.
Health tips | మొక్కజొన్నతో గుండెకు మేలు.. ఇంకా ఎన్ని లాభాలో..!
Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు
CP Radhakrishnan | తిరుమలకు చేరుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి