రైల్వే ట్రాక్ నిర్వహణలో అక్రమాలు!
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో దినసరి లేబర్‌ను కుదించి సిబ్బందితో ప నులు చేయించేందుకు కాంట్రాక్టు సంస్థలకు రైల్వే అధికారులు సహకరించడంపై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది.
- రైల్వే సిబ్బందితో పనులు చేయించిన కాంట్రాక్టర్
- కేసు నమోదు చేసిన సీబీఐ
కాజీపేట, మార్చి 3 : హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో దినసరి లేబర్‌ను కుదించి సిబ్బందితో పనులు చేయించేందుకు కాంట్రాక్టు సంస్థలకు రైల్వే అధికారులు సహకరించడంపై సీబీఐ ఇటీవల కేసు నమోదు చేసింది. రైల్వే సబ్‌డివిజన్ పరిధిలో 2020-24 రైల్వే ట్రాక్ నిర్వహణ పనులను సంధ్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ వేరే కాంట్రాక్టర్లతో కు మ్మకై తక్కువకు టెండర్‌ను దక్కించుకున్నది. సదరు కంపెనీ తగినంత మంది లేబర్లను పనిలో పెట్టకోకుండా, రైల్వే అధికారులను మచ్చిక చేసుకుని సిబ్బందితో ట్రాక్ పనులను చేయించి బిల్లులు తీసుకుంది.
సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ తక్కువకు టెండర్ దక్కించుకుని పనులు ఎలా చేపడుతున్నదని ఇటీవల సీబీఐ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంధ్య కన్స్ట్రక్షన్ కంపెనీ లేబర్‌ను కు దించి ట్రాక్ నిర్వహణ పనులు చేపట్టడం, రైల్వే ఇంజినీరింగ్ కార్మికుల ను పనిలో వాడుకోవడం, రైల్వే అధికారులు సహకరించినట్టు నిర్ధారణకు వచ్చారు. ట్రాక్ పనుల్లో సిబ్బందిని తగ్గించడం, ఆ పనికి సరిపడా లేబర్ కు ఇవ్వాల్సిన ఈపీఎఫ్ తదితర బెనిఫిట్స్ ఇవ్వకుండా నకిలీ రిజిస్టర్‌ను సృష్టించినట్టు తేలింది. కాంట్రాక్టు సంస్థతో రైల్వే అధికారులు కుమ్మక్కైనట్టు గుర్తించి కాంట్రాక్టర్‌తో పాటు రైల్వే అధికారులపై సీబీఐ ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో కేసులు నమో దు చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

