విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్టు చేయూత
ఉన్నత విద్య అభ్యసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా చేయూతనందించడం అభినందనీయమని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.
- హరీశ్‌రావు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
ఉప్పల్, మార్చి 3 : ఉన్నత విద్య అభ్యసిస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా చేయూతనందించడం అభినందనీయమని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 7 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఆయన నివాసంలో చెక్కులను అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు విద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఇది కేవలం దానంగా కాకుండా భవిష్యత్ ఆరోగ్య వ్యవస్ధలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తూ, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపించారని, దీంతో వైట్‌కోట్ విప్లవం సాకారమైందని, దీని ద్వారా వైద్య విద్య అవకాశాలు విస్తరించి ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్, నాయకులు పిల్లి నాగరాజు, మహేష్‌గౌడ్, వంజరి ప్రవీణ్ కరిపే, బోసాని పవన్‌కుమార్, దయాకర్‌రెడ్డి, శ్రవణ్, రఘువరణ్, నాని, రాజేష్‌గౌడ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

