మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Oct 03, 2020 , 06:02:47

ఇందూరులో సినీతారల సందడి

ఇందూరులో సినీతారల సందడి

ఇందూరు : నిజామాబాద్‌ జిల్లా కేంద్రం లో సినీతారల సందడితో కోలాహల వాతావరణం నెలకొంది. బస్టాండ్‌ సమీపంలో చె న్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవాన్ని శు క్రవారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి సినీతారలు పాయల్‌ రాజ్‌పుత్‌, హెబ్బా పటేల్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశా రు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా చెన్నయ్‌ షాపింగ్‌మాల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు మర్రి వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి మాట్లాడు తూ.. సరికొత్త డిజైన్లతో అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో వస్ర్తాలు ఉన్నాయని తెలిపారు. 916 బంగారు ఆ భరణాలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమానికి నటి సమంత వస్తారని ఎదురు చూసిన అభిమానులు నిరాశపడినా ఇద్దరు నాయికల రాకతో సంబురపడ్డారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూర్‌ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 
logo