కార్యాలయాలు కళకళ

నిర్మల్, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి చేపట్టిన లాక్డౌన్తో ప్రభు త్వ, ప్రైవేటు కార్యకలాపాలు, వ్యాపారాలు, ఇతర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. 50 రోజులుగా వివిధ కార్యాలయాలు మూసి ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో వాటిలో మళ్లీ సందడి మొదలైంది. ఇప్పటికే సరి, బేసి విధానంలో పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వైన్సులు, ఇతర దుకాణాలు తెరుచుకున్నాయి. తాజాగా సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యాయి, ముఖ్యంగా రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల కార్యకలాపాలు మొదలయ్యాయి. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, స్టాంపుల అమ్మకం, ఈసీ వంటి సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా లో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, భైంసా, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. గతం లో సగటున 300 నుంచి 350 రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ప్రస్తుతం అందు లో సగం రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సోమవారం 131 రిజిస్ట్రేషన్లు కా గా మంగళవారం 200 వరకు అయ్యాయి. రవాణా శాఖకు సంబంధిం చి ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్లో కార్యాలయాలుండగా రోజుకు 90 వరకు రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించారు. గతంలో మంచిర్యాలలో రోజుకు 500 నుంచి 600 వర కు, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్లో 250 నుంచి 300 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 200 నుం చి 300 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్, రవాణా శాఖ కా ర్యాలయాల్లో కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. భౌతికదూరం పాటించడం, కార్యాలయంలోకి వచ్చే ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు, సబ్బులు అందుబాటులో ఉంచారు.