కొండపాక(కుకునూరుపల్లి), మే 9: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కుకునూరుపల్లి, కొండపాక మండలంలోని దుద్దెడ వరకు రహదారి పొడవునా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. జనహృదయ నేతను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మహిళలు మంగళహారతులతో కేసీఆర్‌కు హారతి పట్టారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుమార్‌యాదవ్, రైతుబంధు సమితి మాజీ మండల కోఆర్డినేటర్ దుర్గయ్య పాల్గొన్నారు.
మర్కూక్, మే 9: ఎర్రవల్లి గ్రామస్తులు కేసీఆర్‌కు గులాబీ పూలతో స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తన వ్యవసాయం క్షేత్రం నుంచి కరీంనగర్‌కు బయలుదేరిన గులాబీ దళపతి కేసీఆర్‌కు దత్తతగ్రామమైన ఎర్రవల్లి గ్రామస్తులు గులాబీ పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు బాల్‌రాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
బెజ్జంకి, మే 9: కరీంనగర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు మండలంలోని తోటపల్లి వద్ద ప్రజలు ఘనస్వాగతం పలికారు., కేసీఆర్ బస్సును ఆపి ప్రజలకు అభివాదం చేశారు. నాయకులు బస్సు ఎదుట గుమ్మడికాయ కొట్టగా, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి ఉన్నారు.
సిద్దిపేట అర్బన్, మే 9: కరీంనగర్ రోడ్‌షోకు వెళ్తున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గురువారం కరీంనగర్ వెళ్తున్న కేసీఆర్‌కు సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుపై పూలు చల్లుతూ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ బస్సులో నుంచి బీఆర్ఎస్ నాయకులకు అభివాదం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ యువజన నాయకులు బస్సులోకెళ్లి కేసీఆర్‌కు దట్టీ కట్టి సెల్ఫీలు దిగారు. పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు రావడంతో బస్సు కదిలేందుకు సుమారు అరగంట సమయం పట్టింది.