గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
గే న్యాయవాది | తనను తాను స్వలింగ సంపర్కుడి (గే)గా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే అంశంపై

వైఖరి తెలుపాలని కేంద్రానికి జస్టిస్ బోబ్డే లేఖ
న్యూఢిల్లీ, మార్చి 31: తనను తాను స్వలింగ సంపర్కుడి (గే)గా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే అంశంపై వైఖరి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే లేఖ రాశారు. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కోరారు. కిర్పాల్ను హైకోర్టు జడ్జిగా నియమించాలని 2017లోనే ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
అయితే దీనిపై ఎందుకు జాప్యం చేస్తున్నారో తెలుపాలని మార్చి మధ్యలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి జస్టిస్ బోబ్డే లేఖ రాసినట్టు సమాచారం. మార్చి 2న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం.. కిర్పాల్ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే కేంద్రం నుంచి మరింత సమాచారం కోరాలని నిర్ణయిస్తూ ఆయన నియామకాన్ని వాయిదా వేసింది. ఇలా వాయిదా పడటం ఇది నాలుగోసారి. కిర్పాల్ స్వలింగ సంపర్కుడు. ఆయన జీవితభాగస్వామి విదేశీయుడు. అతడి వల్ల భద్రతా సమస్యలు తలెత్తవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. అయితే, కిర్పాల్ గే కావడం వల్లనే ఆయన నియామకంపై కేంద్రం జాప్యం చేస్తుందన్న ఆరోపణలున్నాయి. స్వలింగసంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

