Girl falls into water tank, 4 Dies | నీటి ట్యాంకులో పడిన బాలిక.. రక్షించే క్రమంలో ఆమెతో సహా నలుగురు మృతి
Girl falls into water tank, 4 Dies | వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన నీటి ట్యాంక్ నుంచి నీరు తెచ్చే క్రమంలో ఒక బాలిక అందులో పడింది. ఆమెను రక్షించేందుకు ఇద్దరు సోదరులు కూడా అందులోకి దిగారు. వారి బంధువైన మరో యువకుడు వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ నలుగురు ఆ నీటి ట్యాంకులో మునిగి మరణించారు.
జైపూర్: వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన నీటి ట్యాంక్ నుంచి నీరు తెచ్చే క్రమంలో ఒక బాలిక అందులో పడింది. ఆమెను రక్షించేందుకు ఇద్దరు సోదరులు కూడా అందులోకి దిగారు. వారి బంధువైన మరో యువకుడు వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ నలుగురు ఆ నీటి ట్యాంకులో మునిగి మరణించారు. రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Girl falls into water tank, 4 Dies) ఛత్తర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుగ్రామంలో నివసించే 14 ఏళ్ల బాలిక, బుధవారం మధ్యాహ్నం స్థానిక వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన నీటి ట్యాంక్ వద్దకు వెళ్లింది. నీరు తోడుతుండగా కాలు జారడంతో ఆమె అందులో పడిపోయింది.
కాగా, ఆ బాలికను రక్షించేందుకు 18, 16 ఏళ్ల వయసున్న ఆమె ఇద్దరు సోదరులు ఆ నీటి ట్యాంకులోకి దూకారు. వారికి ఈత రాకపోవడంతో తమ చెల్లిని కాపాడలేకపోయారు. వారి కజిన్ అయిన 21 ఏళ్ల యువకుడు ఆ ముగ్గురినీ రక్షించేందుకు ఆ నీటి ట్యాంకులోకి దిగాడు. అయితే ఆ నలుగురూ అందులో మునిగి మరణించారు. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటి ట్యాంకులో మునిగి మరణించిన నలుగురు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bikaner
- Falls
- Four drown
- Girl
RELATED ARTICLES
తాజా వార్తలు
Girl falls into water tank, 4 Dies | నీటి ట్యాంకులో పడిన బాలిక.. రక్షించే క్రమంలో ఆమెతో సహా నలుగురు మృతి
‘పూర్తిస్థాయి బోనస్ చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదు’
Dasoju Shravankumar | రూ.1000 కోట్ల బీసీ భూములను కాంగ్రెస్ సర్కార్ దోచిపెట్టింది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి : డీఈవో శంభుప్రసాద్
వజ్రమ్మ ఘన విజయం చేనేత రంగానికి గర్వకారణం : మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

