ఖైరతాబాద్, మే 10: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలకతీతంగా మున్నూరుకాపు అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్యపటేల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 50లక్షలకు పైగా మున్నూరుకాపు జనాభా ఉందని, రాజకీయంగా మాత్రం వెనుకబాటుకు గురయ్యామని తెలిపారు.
బీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలు మున్నూరుకాపులకు ప్రాధాన్యమిచ్చాయని, ఆయా స్థానాల్లో తమ సామాజికవర్గ అభ్యర్థులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్రావు, కార్యదర్శులు వాసాల వెంకటేశ్వర్లు, తేల్ల హరికృష్ణపటేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ బాలకృష్ణపటేల్, యువజన విభాగం అధ్యక్షుడు దేశెట్టి శివ పటేల్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి లత, గ్రేటర్ అధ్యక్షుడు ఆర్వీ మహేందర్, రాజబాబు, వెంకటేశ్, రవీందర్, కుమార్ భూపతి, ప్రదీప్ పాల్గొన్నారు.