రంగారెడ్డి, మే 10 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజా వుగా జరిగేలా సెక్టోరల్ అధికారులు కృషి చేయాలని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ టీఎస్ఐఆర్డీలో రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ కు సంబంధించి సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా కలెక్టర్ అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకాలు తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హకు వినియోగించుకునేలా చూడాలన్నారు.
అదనపు పోలింగ్ సామగ్రి తమ వద్ద అందుబాటులో ఉండేలా సెక్టోరల్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందించిన బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవడం, చెక్ చేయడం వంటివి చేయొద్దన్నారు. పోలింగ్ రోజున ఉదయం 5.30 గంటలకు మాక్‌పోల్ ప్రారంభమయ్యేలా చూడాలని, ఏజెంట్లు రాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసి మాక్‌పోలింగ్‌ను జరిపించాలన్నారు.
మాక్‌పోల్, పోలింగ్ ప్రక్రియల సందర్భంగా ఎకడైనా ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే, సెక్టోరల్ అధికారులు వెంటనే స్పందించి తమ వద్ద రిజర్వ్‌లో ఉంచిన యూనిట్లను సమకూర్చాలన్నారు. 17-సీ డాక్యుమెంట్, పీవో డైరీ, విజిట్ షీట్, మాక్ పోల్ సర్టిఫికెట్, 17 కాలమ్ ప్రొఫార్మా వంటివి తప్పుల్లేకుండా సక్రమంగా పూరించాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్లకు చేర్చాలని, వాటిని సరిచూసుకుని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు అకడే ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈ తరగతుల్లో రాజేంద్రనగర్ ఆర్డీవో, సహాయ రిటర్నింగ్ అధికారి వెంకట్‌రెడ్డి, సెక్టోరల్ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్ సూచించారు. ఈ నెల 13న జరుగనున్న పోలింగ్ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్, ఓటరు స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు పలు సూచ నలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రి పంపిణీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.