మాస్కో: రష్యాలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలకు రష్యా దేశ బహిష్కరణ విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాస్కోలోని అమెరికా ఎంబసీకి తెలియజేసింది. యూఎస్‌కు చెందిన 10 మంది దౌత్యసిబ్బందిని నెలలోగా దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది.
వారం క్రితం రష్యాకు చెందిన పలువురు దౌత్యసిబ్బందిపై అమెరికా బహిష్కరణ వేటు వేసింది. తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటూ ఆరోపిస్తూ వారిని అమెరికా తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనికి ప్రతిగా రష్యా చర్యలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
మాస్కోలోని యూఎస్ మిషన్ డిప్యూటీ చీఫ్ బార్ట్లే గోర్మాన్ను పిలిపించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు యూఎస్‌కు చెందిన 10 మంది వ్యక్తులను “పర్సనల్ నాన్ గ్రాటా” కింద బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ వార్తలను జిన్హువా వార్తా సంస్థ ధ్రువీకరించింది.
వాషింగ్టన్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం, న్యూయార్క్‌లోని రష్యన్ కాన్సులేట్ జనరల్‌లోని సిబ్బందిని అసమంజసంగా బహిష్కరణకు గురిచేయడానికి ప్రతిస్పందనగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని పేర్కొన్నది. సమీప భవిష్యత్‌లో మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ప్రతిజ్ఞ చేసింది. ఇదివరకే పలువురు ప్రస్తుత, మాజీ అమెరికన్ ఉన్నత స్థాయి అధికారులపై ప్రవేశ నిషేధాన్ని రష్యా విధించింది.
సౌదీ ఎయిర్‌బేస్‌పై దాడి మా పనే: హైతీ తిరుగుబాటుదారులు
అంగారకుడిపై నాసా ఆక్సిజన్ ఉత్పత్తి
మొక్కల పెంపకంపై గూగుల్ డూడుల్
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..