పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్ట్ అబ్సార్ ఆలంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆలం తీవ్రంగా గాయపడ్డాడు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్ట్ అబ్సార్ ఆలంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆలం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్న ఆలం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని పోలీసులు చెప్పారు. కాల్పులు ఎవరు జరిపారో తెలియదని, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇస్లామాబాద్‌లోని ఎఫ్-11 ప్రాంతంలోని పార్కులో సీనియర్ జర్నలిస్ట్ అబ్సార్ ఆలం ఉదయం నడక చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో ఆలంకు గాయాలయ్యాయి. రక్తమోడుతున్న ఆలంనుం వాకింగ్ కు వచ్చిన పలువురు దగ్గర్లో ఉన్న దవాఖానకు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
జర్నలిస్టుపై కాల్పులు జరిపి కారులో పారిపోతున్న వ్యక్తి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమైంది. అబ్సార్ ఆలం పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌గా సేవలందించారు. కాల్పులు జరిపిన వ్యక్తి 27, 28 ఏండ్లు ఉంటాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ కాల్పులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించి.. దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకోవాలని అధికారులకు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

