ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
ఐక్యరాజ్య సమితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో భారతదేశం సభ్యత్వం పొందింది

న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో భారతదేశం సభ్యత్వం పొందింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది.
ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ బోర్డులో చేర్చారు. ఇందులో ఫ్రాన్స్, ఘనా, కొరియా, రష్యా, స్వీడన్ దేశాలు కూడా ఉన్నాయి.
క్రైం ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ కమిషన్లో 2022 జనవరి 1 నుంచి మూడేండ్ల కాలానికి భారత్ ఎన్నికైంది. అదే సమయంలో, ఆస్ట్రియా, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, కెనడా, ఫ్రాన్స్, ఘనా, లిబియా, పాకిస్తాన్, ఖతర్, థాయిలాండ్, టోగో, అమెరికా కూడా మౌఖిక ఆమోదంతో ఎన్నుకోగా.. బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్, ప్రేగ్, చిలీ, క్యూబా రహస్య ఓటు ద్వారా ఎంపికయ్యాయి.
ఐక్యరాజ్య సమితి లింగ సమానత్వం, మహిళా సాధికారత సంఘం ఎగ్జిక్యూటివ్ బోర్డులో మూడేండ్ల కాల పరిమితికి భారతదేశం ఎన్నికైంది. ఐక్యరాజ్య సమితి సంస్థలలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కామెరూన్, కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, ఈజిప్ట్, గాంబియా, గయానా, కెన్యా, మొనాకో, పోలాండ్, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, తుర్క్మెనిస్తాన్, ఉక్రెయిన్ ఉన్నాయి.
ఇది కాకుండా, ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ బోర్డులో కూడా భారతదేశం ఎన్నికైంది. ఈ పదవీకాలం కూడా వచ్చే ఏడాది జనవరి 1 నుంచే మొదలవుతుంది. ఫ్రాన్స్, ఘనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, స్వీడన్ దేశాలు కూడా ఆమోదం ద్వారా ఎన్నికయ్యాయి.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశం ఇప్పటికే మూడు ముఖ్యమైన కమిటీలలో సభ్యునిగా ఉన్నది. వీటిలో తాలిబాన్ సెక్షన్ కమిటీ, లిబియా సెక్షన్ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీ ఉన్నాయి. ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా భారత్ ఎనిమిదోసారి తన సభ్యత్వాన్ని ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి..
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
బ్రిటన్లో తగ్గిన కొవిడ్ మరణాలు..
తూత్తుకుడిలో 1500 కోట్ల కొకైన్ పట్టివేత
అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల అహరణ
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
రాజస్థాన్ జైలు నుంచి ఖైదీలు పరారీ
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
భారత ప్రధానిగా ఇంద్రకుమార్ గుజ్రాల్.. చరిత్రలో ఈరోజు
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

