పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదని, తమ దేశంలో అశాంతిని సృష్టించడానికి వారు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని పాకిస్తాన్ అంతర్గత మంత్రి షేక్ రషీద్ అన్నారు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదని, తమ దేశంలో అశాంతిని సృష్టించడానికి వారు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని పాకిస్తాన్ అంతర్గత మంత్రి షేక్ రషీద్ అన్నారు. క్వెట్టాలో జరిగిన పేలుడు అనంతరం ఒక ప్రకటన విడుదల చేసి.. భారత్‌పై తన అక్కసును వెల్లగక్కారు. పేలుడు జరిపిన ప్రాంతం నగరంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతం అని, విదేశీయులు కూడా ఇక్కడి హోటల్లోనే బస చేస్తారని చెప్పారు. విదేశీయులపై కాల్పులకు తెగబడటం ద్వారా పాకిస్తాన్‌పై వ్యతిరేకత పెంచాలనే దురుద్దేశంతో భారత్ ఇలాంటి పనులకు పాల్పడుతుందని పేర్కొన్నారు.
“భద్రతలో కొంత ఉల్లంఘన జరిగి ఉండటం వల్లనే పేలుడుతో నిండిన కారు హోటల్లోకి ప్రవేశించగలిగింది. పాకిస్తాన్ వ్యతిరేక అంశాలు దేశ శాంతిని దెబ్బతీయాలని కోరుకుంటున్నాయి. అత్యంత సురక్షితమైన ప్రాంతంలో కాల్పులు జరుగడం కొంత ఇబ్బందికరమే. ఇక్కడి ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన చైనా రాయబారి నాంగ్ రోంగ్ కూడా ఇక్కడి హోటల్లోనే బస చేశారు. అయితే పేలుడు జరిగిన సమయంలో ఆయన మరో ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నారు” అని పాకి్ మంత్రి తెలిపారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరిన్ని వివరాలను పంచుకున్న ఆయన.. క్వెట్టా, పెషావర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండిలలో కూడా ఇటువంటి దాడుల బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

