లాస్ ఏంజెల్స్: అంగారక గ్రహంపై ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం సాధ్యమైంది. అక్కడి వాతావరణంలోని గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఆక్సిజన్‌గా మార్చే ప్రక్రియలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఒక అడుగు ముందుకేసింది. మార్టిన్ వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను స్వచ్ఛమైన, ఊపిరి పీల్చుకునే ఆక్సిజన్‌గా మారుస్తున్నారు. మొట్టమొదటి యాక్టివేషన్లో 5గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. ఇది వ్యోమగామికి అందించే దాదాపు 10 నిమిషాల విలువైన శ్వాసకు సమానం అని నాసా తెలిపింది.
భూమిపై నుంచి ఏడు నెలల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18 న అరుణ గ్రహంపైకి అడుగుపెట్టిన ఆరు చక్రాల నాసా రోవర్ పెర్సర్వరెన్స్.. అపూర్వమైన ఆక్సిజన్‌ను వెలికితీసింది. దీని వల్ల భవిష్యత్‌లో ఆక్సిజన్‌ను ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధతప్పింది. ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి బదులుగా మార్టిన్ వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఆక్సిజన్‌గా మార్చే యంత్రాన్ని తీసుకెళ్లడం చాలా సులువని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రారంభంలో ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ, ఇది మానవుల ప్రత్యక్ష ఉపయోగం కోసం మరొక గ్రహం పర్యావరణం నుంచి సహజ వనరులను మొదటి ప్రయోగాత్మక వెలికితీతగా గుర్తించింది. ఈ పరికరం విద్యుద్విశ్లేషణ ద్వారా పనిచేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ అణువుల నుంచి ఆక్సిజన్ అణువులను వేరు చేయడానికి తీవ్ర వేడిని ఉపయోగిస్తుంది. ఇది అంగారక గ్రహంపై వాతావరణంలో 95 శాతం ఉంటుంది.
నాసా ప్రకారం, మార్టిన్ ఉపరితలానికి నలుగురు వ్యోమగాములు రావడానికి 15,000 పౌండ్ల (7 మెట్రిక్ టన్నులు) రాకెట్ ఇంధనం అవసరం అవుతుంది. అలాగే 55,000 పౌండ్ల (25 మెట్రిక్ టన్నులు) ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది. భూమి నుంచి ట్యాంకుల్లో 25 టన్నుల ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి బదులుగా టన్ను ఆక్సిజన్ మార్పిడి యంత్రాన్ని మార్స్‌కు రవాణా చేయడం చాలా ఆచరణాత్మకమైనదని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మోక్సి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ మైఖేల్ హెచ్ట్ తెలిపారు. అంగారకుడిపై నివసించేందుకు, పనిచేసేందుకు వ్యోమగాములకు ఏడాది పొడవునా మెట్రిక్ టన్ను ఆక్సిజన్ అవసరమవుతుందని హెచ్ట్ చెప్పారు.
గంటకు 10 గ్రాముల వరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేలా మోక్సీ యంత్రాన్ని రూపొందించారు. శాస్త్రవేత్తలు ఈ యంత్రాన్ని రాబోయే రెండేండ్లలో వివిధ పరిస్థితులు, వేగంతో కనీసం మరో తొమ్మిది సార్లు నడపాలని యోచిస్తున్నట్లు నాసా తెలిపింది. భూమిపై నుంచి రిమోట్‌తో మార్స్‌పై హెలికాప్టర్ ఎగిరిన రోజు నుంచే ఆక్సిజన్ మార్పిడి కూడా సాధ్యమైందని నాసా పేర్కొన్నది.
మొక్కల పెంపకంపై గూగుల్ డూడుల్
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
పాకిస్తాన్లో సీనియర్ జర్నలిస్టుపై కాల్పులు
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్ సభ్యత్వం
చాద్ అధ్యక్షుడు ఇద్రిస్ డెబ్బీ దారుణహత్య
హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!
వేగాన్లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక
ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు
జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..