ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు
వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు మరింత సులువు కానున్నది. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి

న్యూఢిల్లీ : వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు మరింత సులువు కానున్నది. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు వచ్చే నెల 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) మంగళవారం కొత్త నిబంధనలు జారీ చేసింది. తాజా నిబంధనల మేరకు ఇకపై దేశ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాల నుంచి డ్రైవింగ్ లైసెన్సులు పొందవచ్చు.
ఇప్పటివరకు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా శాఖ అధికారుల ఎదుట డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి వచ్చేది. తొలుత లెర్నింగ్, ఆ తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేవారు. ఈ ప్రక్రియలో డ్రైవర్ల డ్రైవింగ్ నైపుణ్యతలు తేల్చడం కాస్తా ఇబ్బందికరంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులకు వారి డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలో డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అధిక నాణ్యత గల శిక్షణను నిర్ధారించడానికి గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాలలో సిమ్యులేటర్లతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండాలి. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం అవసరాలకు అనుగుణంగా ఇటువంటి కేంద్రాలు రిమైడల్, రిఫ్రెషర్ కోర్సులను పొందే అవకాశాన్ని కూడా ఇవ్వాలి. ఈ కేంద్రాలు ఇప్పుడు పరిశ్రమ-నిర్దిష్ట ప్రత్యేక శిక్షణను ఇవ్వడానికి కూడా అనుమతిస్తారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆన్-సైట్ : వ్యాక్సిన్ డోసుకు ప్రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
మా ఆయన చనిపోలేదంటున్న 38 మంది భార్యలు
చెస్ట్ ప్యాచ్ : దవాఖాన నుంచే కొవిడ్ రోగుల పర్యవేక్షణ
మార్చొద్దు : యెడ్డికి మద్దతుగా లింగాయత్ పీఠాధిపతులు
అమెజాన్ అండ : ఇంజినీరింగ్ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్ స్కిల్స్
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
ఏనుగుల దాడి : జైలులో గ్రామస్థుల బస
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
గైర్హాజరు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

