సంకీర్ణం ఏర్పాటులో నెతన్యాహు విఫలం.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధం
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. మంగళవారం అర్ధరాత్రితో గడువు ముగియడంతో ఇక ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేరనే విషయం స్పష్టమైంది

జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. మంగళవారం అర్ధరాత్రితో గడువు ముగియడంతో ఇక ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేరనే విషయం స్పష్టమైంది. నెతన్యాహు 12 సంవత్సరాలలో మొదటిసారి ప్రతిపక్షంలో కూర్చోనున్నారు.
గత రెండేండ్లుగా నాలుగు ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన ఏర్పడింది. గత మార్చి 23 నుంచి నెతన్యాహు పార్లమెంటులో మెజారిటీ సాధించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ప్రత్యర్థులతో పలుసార్లు జరిపిన సమావేశాలు విఫలమయ్యాయి.
మంగళవారం అర్ధరాత్రి వరకు నాలుగు వారాల వాయిదా ముగిసింది. ప్రభుత్వం ఏర్పాటు కుదరకపోవడంతో ఈ విషయం ఇప్పుడు అధ్యక్షుడు రువెన్ రివ్లిన్ వద్దకు వెళ్తుంది. అధ్యక్షుడు రువెన్ రివ్లిన్ సంకీర్ణ ఏర్పాటుకు మరో రెండు వారాల సమయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నెతన్యాహు ప్రత్యర్థులకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఇవ్వవచ్చు. ఈ రెండూ కాకపోతే తిరిగి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేస్తారని పరిశీలకులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఈ ఏడాది మరో ఎన్నికలను ఎదుర్కోవలసి రావడం దేశంలో నెలల తరబడి రాజకీయ అస్థిరతకు కారణమవుతున్నది.
మార్చి 23 న జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు కు చెందిన లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 120 మంది సభ్యుల పార్లమెంటులో లికుడ్ పార్టీ 30 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 61 సీట్ల మెజారిటీ అవసరం. న్యూ హోప్ పార్టీ , రిలిజియస్ జియోనిజం పార్టీ నెతన్యాహుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి.
ఇవి కూడా చదవండి..
మయన్మార్‌లో పార్సిల్ బాంబు పేలుడు, ఎంపీ సహా ఐదుగురు మృతి
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

