మయన్మార్‌లో పార్సిల్ బాంబు పేలుడు, ఎంపీ సహా ఐదుగురు మృతి
మయన్మార్‌లో హింస కొనసాగుతున్నది. తాజా సంఘటనలో పార్సిల్ బాంబు పేలి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఎంపి థెట్ విన్ హేలింగ్ కూడా ఉన్నాడు

తైపీ: మయన్మార్‌లో హింస కొనసాగుతున్నది. తాజా సంఘటనలో పార్సిల్ బాంబు పేలి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఎంపి థెట్ విన్ హేలింగ్ కూడా ఉన్నాడు. ముగ్గురు పోలీసు అధికారులు కూడా చనిపోయారు. ప్రజాస్వామ్య మద్దతుదారుల ఉద్యమం మంగళవారం హింసాయుతంగా మారింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రభుత్వ వాహానాలకు నిప్పంటించారు. సైన్యం రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పాత టైర్లను రోడ్లకు అడ్డంగా వేసి నిప్పంటించారు. కాగా, మయన్మార్‌లో ప్రజా ఉద్యమం కాస్తా పౌర యుద్ధం వైపు పయనిస్తున్నదని ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి విచారం వ్యక్తం చేశారు.
మయన్మార్ దక్షిణ ప్రాంతంలోని బెగోలో పార్సిల్ బాంబు దాడి జరిగింది. మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పార్శిల్ బాంబుల్లో ఒకటి ఇంట్లో పేలడంతో ప్రాంతీయ ఎంపీ థెట్ విన్ హేలింగ్ మరణించారు. ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఇదే ఘటనలో చనిపోయారు.
మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా తిరుగుబాటుదారులు చురుకుగా మారారు. వీరు గతంలో రెండు విమానాశ్రయాలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ తిరుగుబాటుదారులు మయన్మార్ సైన్యం నుంచి హెలికాప్టర్‌ను ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తున్నది. చిన్ స్టేట్ సరిహద్దులో తిరుగుబాటుదారులు నలుగురు సైనికులను చంపారు. ఎనిమిది మంది సైనికులను గాయపరిచారని సమాచారం అందింది.
మయన్మార్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్నదని ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ అన్నారు. ఇక్కడ దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉన్నదని, వెంటనే చర్యలు తీసుకోకపోతే అంతర్యుద్ధం జరిగే ప్రమాదమున్నదని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి 5 జీ సేవలు..?
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
భారతదేశం సేవలు అజరామరం : హార్వర్డ్ ప్రొఫెసర్ జెస్సీ బంప్
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. బురదలో కూరుకుపోయిన ఇండ్లు
తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ.. చరిత్రలో ఈరోజు
పంచాయతీ విజయం చూడకముందే ముగ్గుర్ని కాటేసిన కరోనా
గ్లేసియర్స్ కరిగి ఏర్పడిన వేలాది సరస్సులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

