Nandamuri Balakrishna | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో అరుదైన ఫీట్ నమోదైంది. అధికారుల ఆహ్వానం మేరకు బాలకృష్ణ లోని నేషనల్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)ను సందర్శించాడు. ఈ సందర్భంగా అధికారుల విజ్ఞప్తితో అక్కడున్న గంట (NSE Bell)ను మోగించాడు బాలకృష్ణ. ఎన్ఎస్ఈ వేదికగా బెల్ మోగించిన తొలి దక్షిణ భారతీయ నటుడిగా బాలకృష్ణ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు బాలయ్య.
ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టం. ఈ రోజు నేను, మా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో NSE Indiaను సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు నా పట్ల చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది. ప్రత్యేక ఆహ్వానం అందించి స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారు.
దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు…ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని.. మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నానని ఈ సందర్భంగా ఓ సందేశాన్ని నెట్టింట షేర్ చేశాడు బాలకృష్ణ. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
Janhvi Kapoor | జాన్వీ కపూర్ చాలా గ్రేట్.. అనీల్ కపూర్ కామెంట్స్ వైరల్
OTT | థియేటర్లో ఆదరణ లేదు.. ఓటీటీలో దుమ్ము లేపుతుందిగా..!
Bigg Boss9 | తొలి రోజే హౌజ్లో గందరగోళం..రీతూ చౌదరి, హరీష్, మనీష్ మధ్య మాటల యుద్ధం