Mohammad Siraj | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ప్లేయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాయి. ఐదవ టెస్ట్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా ఐదు మ్యాచుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. సిరాజ్‌తో పాటు, న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, వెస్టిండీస్‌కు చెందిన జాడెన్ సీల్స్ ఆగస్టు నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 23 వికెట్లు పడగొట్టాడు. జూన్ చివరలో ప్రారంభమైన ఈ సిరీస్ ఆగస్టు ప్రారంభంలో ముగిసింది.
ఐదు టెస్ట్‌లలో సిరాజ్ 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆగస్టులో సిరాజ్ ఒకే ఒక మ్యాచ్ ఆడాడని, కానీ ఆ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ నామినేషన్ పొందేందుకు సరిపోతుందని ఐసీసీ పేర్కొంది. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ది ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో హైదరాబాదీ బౌలర్ 21.11 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో.. టీమిండియా బౌలింగ్‌కు నాయకత్వం వహించాడు. సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఐదో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఐదు వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో నిర్ణయాత్మక స్పెల్ భారత్‌ను విజయం వైపు నడిపించింది. సిరీస్‌ను 2-2తో ముగించింది.
ఈ అద్భుతమైన ప్రయత్నానికి సిరాజ్ ఈ మ్యాచ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇదిలా ఉండగా.. జింబాబ్వేలో టెస్ట్ సిరీస్ విజయంలో అత్యుత్తమ ప్రదర్శనకు న్యూజిలాండ్‌కు చెందిన హెన్రీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో కుడిచేతి వాటం బౌలర్ 16 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ మొదటి టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు, రెండవ టెస్ట్‌లో ఏడు వికెట్లు తీసి తన జట్టు 2-0తో గెలువడంలో కీలకపాత్ర పోషించాడు. సీల్స్ అద్భుతమైన ప్రదర్శన వెస్టిండీస్ 34 సంవత్సరాల తర్వాత వారి తొలి వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించడంలో సహాయపడింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సీల్స్ పది వికెట్లు పడగొట్టాడు. చివరి మ్యాచ్‌లో అతను 18 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు. దాంతో పాకిస్తాన్ జట్టు 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 92 పరుగులకే పరిమితమైంది.
Three exciting pacers are in the running for the ICC Men’s Player of the Month award for August 2025 🤩
— ICC (@ICC) September 8, 2025