Ranga Sudha | తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ కావడంతో సినీ నటి రంగసుధ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని.. తాము కలిసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయటపెడతానని రాధాకృష్ణ తనను గతంలోనే బెదిరించాడని రంగసుధ తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. కాగా రంగసుధ గతంలో రాధాకృష్ణతో రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో గతకొంతకాలంగా వీరిద్దరు దూరంగా ఉన్నారని.. ఈ కోపంతోనే రాధాకృష్ణ నెట్టింట అసభ్యకర పోస్టులు పెట్టినట్టు కథనాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రంగసుధ చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి.. మలయాళంలో హీరోయిన్గా మారింది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ భామకు ఇన్స్టాగ్రామ్లో 9 లక్షలకుపైగా ఫాలోవర్లున్నారు.
Janhvi Kapoor | జాన్వీ కపూర్ చాలా గ్రేట్.. అనీల్ కపూర్ కామెంట్స్ వైరల్
OTT | థియేటర్లో ఆదరణ లేదు.. ఓటీటీలో దుమ్ము లేపుతుందిగా..!
Bigg Boss9 | తొలి రోజే హౌజ్లో గందరగోళం..రీతూ చౌదరి, హరీష్, మనీష్ మధ్య మాటల యుద్ధం