Bigg Boss9 | బిగ్ బాస్ సీజన్ 9 ఎట్టకేలకి గ్రాండ్‌గా లాంచ్ అయింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా, ఇందులో ఆరుగురు కామన్ పీపుల్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ బిగ్ బాస్ సీజన్లలో తొలి రోజు చాలా సరదాగా, ఫన్ గా గడపడం మనం చూశాం. కానీ ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ మాత్రం భిన్నంగా ప్రారంభమైంది. ఎప్పటిలా సరదా పరిచయాలు, హాస్యానికే పరిమితం కాకుండా… తొలిరోజే హౌస్‌లో గొడవలు చెలరేగాయి. హౌస్‌లోని సభ్యులంతా తమ మధ్య పనుల భాగస్వామ్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు బ్యాడ్జ్‌లు ఇచ్చుకుంటూ పనులు కేటాయించారు. ఈ క్రమంలో పవన్, గిన్నెలు కడగడం బాధ్యతగా రీతూ చౌదరికి ఇచ్చాడు. అప్పుడే మొదలైంది చర్చ.
“హౌస్ క్లీనింగ్ అంటే స్టౌవ్ కూడా వస్తుందా?” అంటూ రీతూ ప్రశ్నించగా,హరీష్.. అన్నీ వస్తాయి.. కిచెన్ టేబుల్ కూడా క్లీనింగ్‌లో భాగమే కదా అని సమాధానమిచ్చాడు. ఇమ్మానుయేల్ కూడా మద్దతు ఇస్తూ.. మేమే అన్నీ చేస్తే, తరువాత వాళ్లు కూడా అదే ఫాలో అవ్వాలి అన్నాడు. ప్రియ మాత్రం స్పష్టంగా చెబుతూ.. కుక్ చేసేవాళ్లు క్లీనింగ్ చేయరు.. కుక్ ఒక్కరే చేస్తారు అని తేల్చేసింది. దీంతో హరీష్, క్లీనింగ్ పని ఖాళీగా ఉన్న సంజన చేయాలని సూచించాడు. ఈ వ్యాఖ్యలపై మనీష్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటల తూటాలు పేలాయి.
ఇలా చెప్పడం సబబు కాదు అని మనీష్ స్పందించగా, నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. నువ్వు మాట్లాడొద్దు అని హరీష్ ఘాటుగా అన్నాడు. దీనిపై మనీష్ఎం దుకు మాట్లాడకూడదు? అని ప్రశ్నించడంతో గొడవ ముదిరింది. దీంతో హౌస్‌లో మొదటి రోజు నుంచే సీరియస్ వాతావరణం నెలకొంది. ఇద్దరి మధ్య టెన్షన్ పెరగడంతో , భరణి మద్యవర్తిగా వచ్చి సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ హరీష్ మాత్రం తగ్గే వ్యక్తి కాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఏదైనా అయితే నేను చూసుకుంటా.. అవసరం అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికైనా రెడీ! అంటూ ఓ రేంజ్ లో స్పందించాడు హరీష్. ప్రేక్షకులంతా ఈసారి సీజన్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠలో ఉన్న సమయంలోనే, తొలి ఎపిసోడ్ నుంచే హై డ్రామా తో సీజన్ 9 ఆట మొదలైంది అని చెప్పడంలో సందేహమే లేదు.