Lalbaugcha Raja : గణేశ్ నవరాత్రులు ముగియడంతో దేశవ్యాప్తంగా నిమజ్జనాలు సంబురంగా జరిగాయి. అయితే.. ముంబైలోనే కాకుండా యావత్ భారతమంతా ప్రసిద్ధి చెందిన ‘లాల్బగుచా రాజా’ (Lalbaugcha Raja) నిమజ్జనం మాత్రం ఆలస్యం అవుతోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7 ఆదివారం ఉదయం 9 గంటలకు విగ్రహం గంగమ్మ ఒడికి చేరాలి. కానీ, సముద్రపు అలలు భారీగా వస్తుండడంతో లాల్బగుచా రాజాను తరలిస్తున్న పడవ నీటి మధ్యలో చిక్కుకపోయింది. దాంతో.. నిమజ్జన ప్రక్రియను నిలిపివేశారు. నవరాత్రుల తర్వాత ఈ వినాయకుడు గంగమ్మ ఒడికి ఆలస్యం కావడం చరిత్రలో ఇదే మొదటిసారి.
శనివారం రాత్రి భక్తులు వీడ్కోలు పలుకగా లాల్బగుజా రాజాను నిమజ్జనానికి తరలించారు. దారుల వెంబడి భక్తుల నీరాజనాల మధ్య ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. ఆదివారం ఉదయం గిర్గావ్ చౌపట్టీ బీచ్ వద్దకు గణేశుడు చేరుకున్నాడు. అక్కడి నుంచి పెద్ద పడవ (ర్యాఫ్ట్)లో విగ్రహాన్ని ఎక్కించారు. అయితే.. అప్పటికే అలలు భారీ ఎత్తుతో వస్తున్నాయి. దాంతో.. లాల్బగుచా రాజా విగ్రహాన్ని తీసుకెళ్తున్న పడవ కొంతమేర నీట మునిగింది. 20 మంది వాలంటీర్లు, జాలరులు విగ్రహం ఉన్న తెప్ప అటూఇటూ జరగకుండా చూస్తున్నారు.
#WATCH | Maharashtra: The immersion process of the Lord Ganesh idol of Lalbaugcha Raja pandal is underway at Girgaon Chowpatty beach in Mumbai. pic.twitter.com/UPEHasrVtd
— ANI (@ANI) September 7, 2025
ఉదయం 11:40 సమయంలో అలలు 4.42 మీటర్ల ఎత్తుతో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తీరాన్ని తాకాయి. పరిస్థితి గమనించిన గణేశ్ ఉత్సవ మండలి నిమజ్జనాన్ని వాయిదా వేసింది. అలల ఉద్దృతి తగ్గుముఖం పట్టాక తుది ఘట్టాన్ని పూర్తి చేయాలని మండప నిర్వాహకులు, అధికారులు భావిస్తున్నారు. ఈరోజు రాత్రి 11 గంటలకు వినాయకుడి నిమజ్జనం చేయనున్నారని సమాచారం.
STORY | After delay due to high tide, Lalbaugcha Raja idol immersion expected at around 11pm
The iconic Lalbaugcha Raja idol was shifted onto a raft on Sunday afternoon after delays since morning due to high tide and technical challenges, with final immersion, delayed by several… pic.twitter.com/oL8u5TAPdW
— Press Trust of India (@PTI_News) September 7, 2025