శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘సువర్ణ టెక్స్టైల్స్’. ప్రశాంత్ నామిని దర్శకుడు. అనిల్ ఈరుగుదిండ్ల నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
దర్శకుడు వేణు ఊడుగుల టీజర్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కొంత అడల్డ్ కంటెంట్ ఉన్నా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగానే సినిమా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నామిని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చందు ఎ.జె, సంగీతం: భరత్.ఎం.