Basil Joseph | మలయాళ ఇండస్ట్రీలో ఉన్న టాప్ టాలెంటెడ్ యాక్టర్లలో జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు బాసిల్ జోసెఫ్. తాను అరుదైన అవకాశాన్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏంటో అది అనుకుంటున్నారా..? ఇటీవలే తొలి మలయాళ ఫీ మేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్ లోక ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యే దిశగా దూసుకెళ్తోంది.
అయితే ఈ సినిమాలో నటించే అవకాశం మిస్ చేసుకున్నానన్నాడు బాసిల్ జోషెప్. ఓ చిట్‌చాట్‌లో బాసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ డొమినిక్ అరుణ్ తనకు ముఖ్యమైన పాత్రను ఆఫర్ చేశాడని.. కథ కూడా వినిపించాడని చెప్పాడు. కానీ తాను వేరే కమిట్మెంట్స్ కారణంగా లోక సినిమాను ఒప్పుకోలేదన్నాడు. లోక చాఫ్టర్ 1లో తాను పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకున్నానన్నాడు. అయితే డైరెక్టర్ డొమినిక్ అరుణ్ తనకు ఏ పాత్రను ఆఫర్ చేశాడనేది మాత్రం చెప్పలేదు బాసిల్ జోసెఫ్.
టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ను డైరెక్ట్ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు బాసిల్ జోసెఫ్.
Janhvi Kapoor | జాన్వీ కపూర్ చాలా గ్రేట్.. అనీల్ కపూర్ కామెంట్స్ వైరల్
OTT | థియేటర్లో ఆదరణ లేదు.. ఓటీటీలో దుమ్ము లేపుతుందిగా..!
Bigg Boss9 | తొలి రోజే హౌజ్‌లో గందరగోళం..రీతూ చౌదరి, హరీష్, మనీష్ మధ్య మాటల యుద్ధం