నల్లగొండ, మార్చి 04 : నల్లగొండ పట్టణం 9వ డివిజన్ గంధంవారిగూడెంలో గల జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవసరమైన సామగ్రితో పాటు ఇంగ్లీష్ డిక్షనరీలను స్థానిక కార్పొరేటర్ బానోతు దీప్లా నాయక్తో కలిసి కేఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త భాను చందర్ యాదవ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో అవసరమైన సామగ్రి అందించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గీత, ఉపాధ్యాయులు, వజ్జే శ్రీనివాస్ యాదవ్, చిన్నాల ఆంజనేయులు, మాధవ రెడ్డి, ముత్తిరెడ్డి, జల్లాల జానయ్య, మంటిపెల్లి లింగయ్య, కందుల శ్రీనివాస్, చిన్నాల అంజయ్య, ఆవుల కిరణ్, చిన్నాల భాస్కర్, బోడా వంశీ, మన్నే అశోక్, చిన్నాల సాయి కుమార్, జల్లెల్ల వెంకటేశ్, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.