KHxRK | కమల్ హాసన్, రజనీకాంత్ మూవీ షూట్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన అనిరుధ్..!
KHxRK | ప్రతీ రోజు KHxRKకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై హైప్ పెంచేస్తోంది. తాజా న్యూస్ ఒకటి మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది.
KHxRK | 46 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత లెజెండరీ యాక్టర్లు కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘KHxRK’వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి ‘జైలర్’ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ప్రతీ రోజు ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై హైప్ పెంచేస్తోంది. తాజా న్యూస్ ఒకటి మూవీ లవర్స్‌తోపాటు అభిమానుల్లో క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా..? అని ఎదురుచూస్తున్నఅభిమానుల కోసం అదిరిపోయే వార్త షేర్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఈ టాలెంటెడ్ కంపోజర్ ప్రకారం ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది మొదలు కానుందని చెప్పాడు. ప్రస్తుతం రజినీకాంత్, కమల్ హాసన్ తమ కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్లో చేరనునున్నారని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాని 80స్, 90స్లో ఉపయోగించిన ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేయనున్నారంటూ ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. నెల్సన్, రాజీవ్ మీనన్ ఇప్పటికే ప్రోమోను ఇదే పద్దతిలో షూట్ చేయాలనుకున్నా.. టైం తక్కువగా ఉండటం వల్ల డిజిటల్ మెథడ్‌లో ప్రోమోను తెరకెక్కించారని ఇన్సైడ్ టాక్.
ఇప్పటికే KHxRK మల్టీస్టారర్ స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేయగా.. గ్లింప్స్‌లో కమల్-రజనీ ఇద్దరూ ఎవరు స్టైల్లో వారు కనిపిస్తూ.. కాస్ట్యూమ్స్, బూట్లు, బెల్ట్, వాచ్, కళ్లద్దాలతో ఒకరినొకరు డామినేట్ చేసుకునేలా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. కమల్–రజనీ రీయూనియన్ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఖచ్చితంగా అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. మరి నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరితో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
Read Also :
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. చైనా సాయం కోరిన ఎన్ఐఏ కోర్టు
Dragon | మే 20న ‘డ్రాగన్’ విస్ఫోటనం .. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు!
Sircilla | సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. 10 మందికి గాయాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

