Allu Kanakaratnam | దివంగత లెజెండరీ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు అల్లు అరవింద్ కుటుంబసభ్యులు కనకరత్నమ్మ దశదినకర్మ నిర్వహించారు.
హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్.. అనంతరం కనకరత్నమ్మ చిత్రపటంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాంచరణ్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు..
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గారి మాతృమూర్తి, దివంగత మహానటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారి దశదినకర్మలో పాల్గొని, వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, అల్లు అరవింద్, @alluarjun గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/Zi9o4rueTM
— BRS Party (@BRSparty) September 8, 2025
Srinivas Goud | రైతులందరికి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Kanagal : యూరియా కోసం కనగల్ రైతుల ఎదురు చూపులు