మహబూబ్‌నగర్ : రైతులందరికి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. హబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బోయపల్లి రోడ్డు న్యూగంజ్‌లోని హకా రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి..తెల్లవారుజామున నుండి రైతులు యూరియా కోసం లైన్లో వేచి ఉంటున్నారని తెలిపారు. వారికి తాగు నీరు అందించాలని సూచించారు.
రైతులందరికి యూరియా అందేవిధంగా స్టాక్ తెప్పించుకోవాలన్నారు. రైతులకు ఎకరానికి 2 యూరియా బస్తాలు పంపిణీ చేయాలన్నారు. ఇంతకు ముందు రైతులకు ఆధార్ కార్డు పై యూరియా పంపిణీ చేసిన విధంగా, రైతులను పట్టాదారు పాస్ పుస్తకం కావాలని తిప్పించుకోకుండా పంపిణీ చేయాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.