చరిత్రకు అడుగు దూరంలో.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్‌కు భారీ ఆధిక్యం
రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ తమ మొదటి ప్రయత్నంలోనే టైటిల్‌ను దక్కించుకుని సరికొత్త చరిత్ర లిఖించేందుకు అడుగుదూరంలో నిలిచింది.
- నబీ సూపర్ బౌలింగ్
హుబ్లీ: రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరిన జమ్మూకశ్మీర్ తమ మొదటి ప్రయత్నంలోనే టైటిల్‌ను దక్కించుకుని సరికొత్త చరిత్ర లిఖించేందుకు అడుగుదూరంలో నిలిచింది. కర్ణాటకతో హుబ్లీలో జరుగుతున్న ఫైనల్లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 291 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అదీగాక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జమ్మూకశ్మీర్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 186/4తో నిలిచింది. కమ్రాన్ ఇక్బాల్ (94 బ్యాటింగ్) శతకానికి చేరువలో ఉన్నాడు. మొత్తంగా ఆ జట్టు 477 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 220/5తో నాలుగో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక.. మరో 73 పరుగులు మాత్రమే జతచేసి 293 రన్స్‌కు ఆలౌట్ అయింది.
మయాంక్ అగర్వాల్ (160), కృష్ణ (36) నిష్క్రమించాక ఆ జట్టు కుప్పకూలడానికి పెద్దగా సమయం పట్టలేదు. కశ్మీర్ పేస్ సంచలనం అకిబ్ నబీ (5/54) మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు సునీల్ (2/51), యుధ్వీర్ (2/75) కర్ణాటకను కోలుకోనీయలేదు. నబీకి రంజీల్లో ఐదు వికెట్లు తీయడం ఇది 15వ సారి కాగా ఈ సీజన్లో మొత్తంగా అతడు 60 వికెట్లు పడగొట్టడం గమనార్హం. 92 ఏండ్ల రంజీ చరిత్రలో ఒక పేసర్ ఒక సీజన్లో 60 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి మాత్రమే. ఈ మ్యాచ్‌లో కర్ణాటక గెలుపు అసాధ్యమైన వేళ.. ఫైనల్ డ్రా గా ముగిసినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్ తమ మొదటి రంజీ ట్రోఫీని దక్కించుకోవడం ఇక లాంఛనమే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

