e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తామన్న అజ్జూ భాయ్‌

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తామన్న అజ్జూ భాయ్‌

హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తామన్న అజ్జూ భాయ్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో ముంబై నుంచి తరలించే మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్.

ఈ మేరకు ఆయన ఆదివారం తమ వద్ద లభించే సౌకర్యాల వివరాలను బీసీసీఐకి అందించారు. ముంబైలో రద్దు చేసే మ్యాచులను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తాము సిద్ధమని స్పష్టంచేశారు.

10 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్న ముంబైలో కొవిడ్‌ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు ఇండోర్, హైదరాబాద్‌లను స్టాండ్-బై వేదికలుగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది.

వాంఖడే స్టేడియంకు చెందిన 10 మంది గ్రౌండ్‌మెన్, కొందరు ఈవెంట్ మేనేజర్లు కొవిడ్‌ వైరస్‌కు పాజిటివ్ పరీక్షించిన తరువాత అక్కడ మ్యాచులను నిర్వహించడం ఇబ్బందికరంగా తయారైంది. దాంతో వాంఖడే మైదానంలో నిర్వహించే మ్యాచులను ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు స్టాండ్‌ బై గ్రౌండ్లను సిద్ధం చేయాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం.

‘ఈ కష్టకాలంలో మనం ఒకరికొకరు అండగా ఉందాం. ఐపీఎల్ 2021 మ్యాచులను సురక్షితమైన, భద్రమైన వేదికలలో నిర్వహించేలా చూడాలనుకుంటున్నాం. ఇందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తన సౌకర్యాలను బీసీసీఐ దృష్టికి తీసుకువస్తున్నది’ అని అజారుద్దీన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశారు.

ముంబైలో శనివారం కొత్తగా 9,108 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్‌ కఠిన చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానున్నది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.

వారాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. వారాంతరాల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించనున్నారు. థియేటర్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించింది.

ఇలాఉండగా, పరిస్థితులు ఇంతగా దిగజారినా ముంబైలో ఆటలకు ఆతిథ్యం ఇస్తానని బీసీసీఐ సీనియర్ ఆఫీసు బేరర్ శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ జట్లు అన్నీ బయో బబుల్‌ ఉండటంతో టోర్నమెంట్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10 న తొలిగెమ్‌ ముంబైలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరుగుతుందని చెప్పారు.

పరిస్థితులు చేయి దాటిపోయిన పక్షంలో మ్యాచులను నిర్వహణకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు హైదరాబాద్, ఇండోర్ మైదానాలను స్టాండ్‌బైలో పెట్టారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ముంబైలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ – వీటికి వాంఖడే స్టేడియంలోకి ప్రవేశం లేదు.

వాంఖడే స్టేడియంలో మొదటి మ్యాచ్ ఏప్రిల్ 10 న గత ఏడాది ఫైనలిస్టులు ఢిల్లీ క్యాపిటల్స్, మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి..

అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

ఫాల్కే అవార్డును దోస్త్‌ రాజ్‌ బహదూర్‌కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్

రైతులకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మమ్మల్ని శిక్షిస్తోంది: కేజ్రీవాల్

స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు

ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి

లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్‌.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి

బిల్‌గేట్స్‌.. మైక్రోసాఫ్ట్‌.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్‌.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి త‌ర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్‌ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తామన్న అజ్జూ భాయ్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement