MLA Sanjay | మల్లాపూర్, జూలై 7: మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కుంచెపు గాయత్రి డిగ్రీ చదవడానికి హైద్రాబాద్ లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో సీటు సాధించింది. కాగా ఈ విద్యార్థిని అక్కడ ఉండేందుకు హాస్టల్ వసతి కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తెలుసుకోని వెంటనే తన హాస్టల్ వసతి ఫీజు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని పంపించారు.
ఈ నగదును సదరు విద్యార్థినికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్ గాయత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సుద్దు రాజకుమార్, నాయకులు భైరి రవికుమార్, దేశెట్టి నాగేష్, ఎండీ అమీన్, లస్మయ్య, నవకుమార్, గంగనర్సయ్య, భాస్కర్, నారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.