Crocodile | ఒడిశా (Odisha)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జాజ్‌పూర్ (Jajpur) జిల్లాలోని ఓ నదీ తీర గ్రామంలో మొసలి (Crocodile) బీభత్సం సృష్టించింది. ఓ మహిళను అమాంతం నదిలోకి ఈడ్చుకెళ్లింది (Crocodile drags woman into river). ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బారి బ్లాక్‌లోని బోడు పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలిని 55 ఏళ్ల సౌదామినిగా గుర్తించారు. ఆమె బట్టలు ఉతికేందుకని ఖరస్రోట నది వద్దకు వెళ్లింది. నది ఒడ్డున ఓ చోట బట్టలు ఉతుకుతుండగా.. ఓ మొసలి ఆమెను అమాంతం నదిలోకి లాక్కెళ్లింది. ఓ వంతెన గుండా వెళ్తున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు. అయితే, సాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృష్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
A live video went viral from Jajpur, Bari area, where a crocodile dragging a waman in to the river, pubil getting panic after watching video #odisha #jajour #crocodile #news #viral #live pic.twitter.com/J1lR1k01D2
— Ajay kumar nath (@ajaynath550) October 7, 2025
Also Read..
Snow | మంచు అందాలతో పర్యాటకులను ఆహ్వానిస్తోన్న గుల్మార్గ్.. ఫొటోలు వైరల్
Karur Stampede | కరూర్ బాధిత కుటుంబాలతో వీడియో కాల్లో మాట్లాడిన విజయ్
Annamalai | రాజ్యసభ సీటు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు.. కమల్ హాసన్‌పై అన్నామలై ఫైర్