Karur Stampede | గతనెల 27న కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తొక్కిసలాట (Karur Stampede) జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటన జరిగిన పదిరోజులకు పైనే అయినా ఇప్పటికీ బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలతో (Victims Families) విజయ్ వీడియో కాల్లో మాట్లాడారు. బాధితులను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.కొన్ని ఇబ్బందుల కారణంగా కలవలేకపోతున్నానని.. త్వరలోనే కరూర్‌ను సందర్శిస్తానని చెప్పినట్లు తెలిసింది.
మరోవైపు కరూర్ ఘటన విషయంలో విజయ్ తీరును మద్రాసు హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తొక్కిసలాట జరిగిన వెంటనే టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ అక్కడ నుంచి మాయం కావడం, ఆయనపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇదేం రాజకీయ పార్టీ అంటూ టీవీకేని విమర్శించిన జస్టిస్ ఎన్ సెంథిల్‌కుమార్ తొక్కిసలాట మరణాల తర్వాత అక్కడి నుంచి ఆ పార్టీకి చెందిన బాధ్యులందరూ పారిపోయారని, ఎవరూ బాధ్యతను తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి టీవీకే వ్యవహార శైలిని ఖండించారు.
దుర్ఘటన పట్ల టీవీకే కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, ఆ పార్టీ నాయకుడి మానసిక స్థితికి ఇది అద్దం పడుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌ని తిరస్కరించిన కోర్టు సీనియర్ ఐపీఎస్ అధికారి, నార్త్ జోన్ ఐజీ అస్రా గర్గ్ నేతృత్వంలో సిట్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై ‘సిట్’ దర్యాప్తు ఆదివారం మొదలైంది. సిట్‌లో తనతోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు సహా 11మంది పోలీసు అధికారులు ఉన్నారని సిట్ ప్రధాన అధికారి గార్గ్ చెప్పారు. ఘటనాస్థలాన్ని సిట్ అధికారులు పరిశీలించారు.
Also Read..
విజయ్‌లో ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు
Annamalai | రాజ్యసభ సీటు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు.. కమల్ హాసన్‌పై అన్నామలై ఫైర్
Arvind Kejriwal | ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ప్రభుత్వ నివాసం కేటాయింపు