Annamalai | ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ (Kamal Haasan)పై బీజేపీ నేత అన్నామలై (Annamalai) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటనలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై మండిపడ్డారు. కమల్ అధికార డీఎంకేకి అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రాజ్యసభ సీటు కోసం తన ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గతనెల 27న కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక డీఎంకే నేతలతో కలిసి కమల్ కరూర్ వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ప్రశంసలు గుప్పించారు. ‘ఈ ఘటన జరగడం బాధాకరం. ఇది పరిపాలన తప్పు కాదు. పోలీసులు తమ విధిని నిర్వర్తించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా గౌరవంగా వ్యవహరించారు’ అంటూ పేర్కొన్నారు. కమల్ వ్యాఖ్యలపై అన్నామలై తీవ్రంగా స్పందించారు.
‘ఒక రాజ్యసభ సీటు కోసం కమల్ చాలా కాలంగా తన అంతరాత్మను అమ్ముకున్నారు. కరూర్ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా..? ఆయన మరీ ఇంత దిగజారాలా..? అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు’ అని అన్నామలై అన్నారు.
Also Read..
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. శిల్పా శెట్టిని 4 గంటలపాటూ విచారించిన పోలీసులు
Arvind Kejriwal | ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ప్రభుత్వ నివాసం కేటాయింపు
Bihar Elections | బీహార్‌లో బీజేపీ ఎన్నికల వ్యూహం.. ఫేమస్ సింగర్‌ను బరిలోకి దింపనున్న కమలదళం