న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) ఆకట్టుకోవడంలో భారత్ దూసుకుపోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఎఫ్డీఐలు 18 శాతం పెరిగి 47.87 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
క్రితం ఏడాది ఇదే సమయంలో భారత్లోకి 40.67 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.