Mohan Babu | మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా పడింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆదాయాన్ని వెల్లడించకపోవడం విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది. దీంతో ఆ మొత్తాన్ని యూనివర్సిటీ చెల్లించింది.
2022-23 నుంచి గత ఏడాది సెప్టెంబర్ 30 వరకు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 కూడా తిరిగి చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆ మొత్తాన్ని విద్యార్థులకు రూ.15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఆ యూనివర్సిటీ అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్‌కు కమిషన్ సిఫారసు చేసింది.