Rahul Gandhi | వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామునుంచే ప్రయా ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
పీడబ్యూవో నాయకులు గీత, మహేందర్, ఎంఎస్ఎఫ్ నాయకులు ఆనంద్ లతో పాటు మరింత మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ.. తన పర్యటనలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Vikarabad2