శ్రీనగర్: బంతి ఆధిపత్యం చెలాయిస్తున్న ఇరానీ కప్‌లో ఈ సీజన్ రంజీ విజేత జమ్మూకాశ్మీర్‌కు కీలక ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియాను 237 రన్స్‌కే ఆలౌట్ చేసిన ఆ జట్టు.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ 278 పరుగులు చేసింది.
ప్రధాన బ్యాటర్లు విఫలమైనా కెప్టెన్ పారస్ డోగ్రా (75), అబ్దుల్ సమద్ (57), లోయరార్డర్లో నాసిర్ ముజాఫర్ (64) రాణించడంతో ఆ జట్టు 41 రన్స్ ఆధిక్యం సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 24/1 రన్స్ చేసింది.