సెయిలింగ్ పోటీల్లో నేత్ర కుమనన్ కాంస్య పతకంతో మెరిసింది. మహిళల డింగీ ఈవెంట్లో 29 ఏండ్ల నేత్ర 14 నెట్ పాయింట్లు సాధించి కాంస్యం ఖాయం చేసుకుంది. గత మూడు ఆసియా క్రీడల్లో పోటీపడి రెండుసార్లు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని కోల్పోయిన నేత్ర నాలుగో ప్రయత్నంలో పోడియంపైకి వచ్చింది.
మరోవైపు పురుషుల డింగీ ఈవెంట్లో పోటీపడిన ఒలింపియన్ విష్ణు శరవణన్ 21 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమై పతకం కోల్పోయాడు. ఇక, సెపాక్తక్రా పోటీల్లో భారత పురుషుల జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.పురుషుల క్వాడ్రంట్ సెమీఫైనల్ పోరులో భారత జట్టు 0-2తో ఆతిథ్య జపాన్ చేతిలో ఓటమి పాలై కంచు పతకంతో సరిపెట్టింది.