Hyderabad | హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. బైరమల్గూడ ఫ్లైఓవర్‌పై అతివేగంతో దూసుకొచ్చిన కారు.. డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి.
ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారంఅందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారంతా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఎల్బీనగర్లో కారు బీభత్సం
సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై అతివేగంతో దూసుకెళ్లి లారీని, డివైడర్‌ను ఢీకొట్టడంతో పూర్తిగా దగ్ధమైన కారు
వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కారులోని వారంతా మద్యం మత్తులో ఉన్నారని తెలిపిన… pic.twitter.com/FyoV2gdMbw
— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026