Mad Qube | సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ కాంబోలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ (Mad). కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డెబ్యూ యాక్టర్లతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీలో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రేడ్ పండితుల అంచనాలకు మించి బాక్సాపీస్‌ను షేక్ చేసింది.
ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ (Mad 2) కూడా రాగా.. మిక్స్ డ్ రివ్యూస్ రాబట్టుకున్న సీక్వెల్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన ఈ మూవీలో విష్ణు ఓయ్ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. మిత్రమండలి మూవీ ప్రమోషన్స్ లో విష్ణు ఓయ్ మ్యాడ్ త్రీక్వెల్ (Mad 3)గురించి ఆసక్తికర అప్డేట్ అందించాడు. మ్యాడ్ 3 షూటింగ్ ఇప్పటికే మొదలైందని చెప్పాడు.. అంతేకాదు త్వరలోనే సోషల్ మీడియా ద్వారా మూవీ లవర్స్, అభిమానులకు మూడో పార్ట్ గురించి అధికారికంగా అప్డేట్ అందించనున్నట్టు చెప్పాడు.
మ్యాడ్ క్యూబ్ ప్రాజెక్ట్‌ను 2026 వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మ్యాడ్ ప్రాంచైజీలో రాబోతున్న మూడో పార్ట్‌ను నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్