Ustaad Bhagat Singh | ఇటీవలే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్ కల్యాణ్. సుజిత్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. పవన్ కల్యాణ్ ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఫోకస్ పెట్టబోతున్నాడని తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమా కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ పాపులర్ పొలిటీషియన్ మల్లారెడ్డిని సంప్రదించాడని వార్తలు కూడా వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్‌లో విలన్ రోల్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ తనను కలిశాడని మల్లారెడ్డి స్వయంగా చెప్పారు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మల్లారెడ్డి మాట్లాడుతూ.. హరీష్ శంకర్ నా కాలేజ్‌కు వచ్చాడు. నా పాత్రకు సంబంధించి గంట పాటు స్క్రిప్ట్‌ను వినిపించాడన్నాడు.
అంతేకాదు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాడని చెప్పిన మల్లారెడ్డి.. తనకు విలన్ పాత్ర అంటే అంత సౌకర్యవంతంగా ఉండదని హరీష్‌కు చెప్పానన్నాడు. ఇంటర్వెల్ దాకా నేను హీరోను తిడుతుంటా.. ఇంటర్వెల్ తర్వాత హీరో నన్ను దూసిస్తాడు.. కొడతాడని చెప్పుకొచ్చాడు. ఇక మల్లారెడ్డి చేసిన కామెంట్స్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని దళపతి విజయ్ తేరి సినిమాతో పోల్చుకుంటున్నారు నెటిజన్లు. ఈ మూవీలో విలన్‌గా నటించిన జే మహేంద్రన్ పాత్రలాగే మల్లారెడ్డి రోల్‌ను డిజైన్ చేసి ఉంటాడని చర్చించుకుంటున్నారు.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్