e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News బహిరంగ ప్రసంగాల్లో భాషా మర్యాద పాటిద్దాం : వెంకయ్యనాయుడు

బహిరంగ ప్రసంగాల్లో భాషా మర్యాద పాటిద్దాం : వెంకయ్యనాయుడు

దండి (గుజరాత్) :బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన, బలమైన ప్రజాస్వామ్య భావనకు ఇది అత్యంత కీలకమన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా గుజరాత్ లోని చారిత్రక దండి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 రోజుల ‘దండి మార్చి’ ఉత్సవాల ముగింపు సభకు హాజరై ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రత్యర్థుల పట్ల సైతం మర్యాదపూర్వకమైన, గౌరవప్రదమైన భాషను ఎల్లప్పుడూ ఉపయోగించే మహాత్మ గాంధీ నుంచి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని సూచించారు. గాంధీ మహాత్ముడు చెప్పిన అహింసా సిద్ధాంతం, శారీరక హింసకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. మాటలు, ఆలోచనలు కూడా ఈ విషయాన్ని ప్రతిబింబించాలని పేర్కొన్నారు.

- Advertisement -

మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి మహనీయుల జీవితాలు మనం కలలు కంటున్న నవభారత నిర్మాణం దిశగా కలిసి పని చేయడానికి ప్రేరణిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. తమ సంపదను నలుగురికీ పంచే భారతదేశ స్ఫూర్తికి ఇది ప్రతిబింబమన్నారు. ప్రపంచం మొత్తాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి, సరికొత్త ఆవిష్కరణల అవసరాన్ని నొక్కి చెప్పిందని తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని అమృత్ మహోత్సవ్ చాటి చెబుతున్నదని ఆయన అన్నారు. అమృత్ మహోత్సవ్ ఉద్దేశం స్వాతంత్ర్య పోరాట వీరుల నిస్వార్థ పోరాట స్ఫూర్తికి నివాళులు అర్పించడమే గాక, వారి ఆదర్శాలు, విలువలకు పునరంకితం కావడమని తెలిపారు. దండి మార్చి ఉత్సవంలో 25 రోజుల్లో 385 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన 81 మంది వాలంటీర్లను అభినందించారు. దండి మార్చి ఉత్వవాల్లో పాల్గొన్న వాలంటీర్లతో సంభాషించారు.

కార్యక్రమానికి ముందు అక్కడి ప్రార్థనా మందిరంలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. 1930 ఏప్రిల్ 4 రాత్రి గాంధీజీ గడిపిన సైఫీ విల్లాను సందర్శించారు. అనంతరం జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుజరాత్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ యొక్క భౌగోళిక సూచిక (జీఐ టాగ్) ఉత్పత్తులపై ప్రత్యేక ఎన్వలప్‌ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు.

కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, పార్లమెంట్ సభ్యులు సీఆర్‌ పాటిల్, సబర్మతి ఆశ్రమ ట్రస్టీ సుదర్శన్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం స్వరాజ్యాన్ని సముపార్జించుకుని 75 సంవత్సరాల మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో 75 వారాల పాటు నిర్వహించ తలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్ ను 2021 మార్చి 21 న సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 75 ఏళ్ళలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రతిబింబించే విధంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఎయిర్‌టెల్‌-జియో మధ్య ఒప్పందం.. మూడు సర్కిళ్లల్లో స్పెక్ట్రం బదలాయింపు

ప్రధానిపై అసత్య రాతలు.. బ్లాగర్‌‌కు 72 లక్షల జరిమానా

బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్‌ఖాన్

ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్

ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు

వ్యాక్సిన్‌ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్‌ శరణార్థులు

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌గా చింతన్‌ వైష్ణవ్

మ‌నుషుల నుంచి పిల్లులు, కుక్క‌ల‌కు క‌రోనా: డ‌బ్ల్యూహెచ్‌వో

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్‌ జంట

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement